గడిచి పోతున్న జీవితంలో ఉత్సహన్ని ఉల్లాసాన్ని నింపుకుంటూ కుటుంబ సంబంధాలు, స్నేహం, మానవత్వం వంటివాటిని నిలుపుకుంటూ అనందంగా జరుపుకునేవి పండుగలు. ప్రాంతాన్ని, భాషని బట్టే అచార వ్యవహారాలు, సంస్కృతి నడుస్తూ ఉంటాయి. ప్రాంతము, భాష, సంస్కృతి ఒకదానితో ఒకటి ముడిపడే ఉంటాయి. ఏ పండుగ జరుపుకున్నా ఆ యా ఋతువుల్ని అనుసరించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకునే పిండివంటలు కూడా నిర్ణయింప బడ్డాయి. ఏ పండుగకి ఏ పిండివంటలు చెయ్యాలో, ఏ పదార్ధం ఏ దేవుడికి నైవేద్యంగా పెట్టాలో కూడా పూర్వ కాలం నుంచి వస్తున్నసంస్కృతిలో భాగమే. ప్రతి పండుగరోజు ఆ పండుగ జరుపుకోడానికి కారణం, అందువల్ల ప్రయోజనము తెలియ చేసే విధంగా పాటలు, ఆటలు హరికథలు, బుర్ర కథలు వంటివి తెలుగుజాతి సంస్కృతిని నిలబెట్టడంలో ముఖ్య పాత్రని పోషిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతిని గొప్ప సంపదగా భద్రపరిచి ఎక్కడా ఆగిపోకుండా తరతరాలకి అందిస్తున్నది మనము జరుపుకుంటున్న పండుగలే!
Read more